బాలీవుడ్ నటీ మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ సోకిందని ఆమె శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. మృణాల్ ఠాకూర్ ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉండడంతో.. వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా నేను ఒంటరిగానే ఉన్నాను. నేను నా డాక్టర్ మరియు ఆరోగ్యనిపుణులు ఇచ్చిన ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాను అని ఆమె తన ప్రకటనలో పేర్కొంది. మీరు నాతో కాంటాక్ట్‌లో ఉన్నట్టయితే దయచేసి వెంటనే పరీక్షించుకోవాలని సూచించింది. అందరూ సురక్షితంగా ఉండాలని కోరారు మృణాల్ ఠాకూర్.
ఈవారంలో ఆమె నటించిన జెర్సీ చిత్రం డిసెంబర్ 31న విడుదల అవ్వాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా అది కాస్త వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులు, కొత్త కొవిడ్, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా మార్గదర్శకలు. ఒక బృందంగా ఏర్పడి జెర్సీ విడుదల వాయిదా వేసారు. ముఖ్యంగా మేము వీలు అయినంత తొందరగా మా చిత్రంతో మిమ్మల్నీ కలుస్తాం. 2022లో ప్రతీ ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రధాన నటుడు షాహిద్ కపూర్ జెర్సీ గురించి రాసుకొచ్చారు. .