దారుణం : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. !
గాయాలపాలైన వారినీ ఘటనస్థలానికి సమీపంలో ఉన్నటువంటి హరిహరగంజ్ సీహెచ్‌సీకీ తరలించారు. బసంతి(17), అర్పణ(14), నీలం (16) ల పరిస్థితి విషమంగా ఉండడంతో ఔరంగాబాద్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం ఆరుగురు మృతి చెందడంతో పాటు.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరొక ఆరుగురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని.. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.