తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో త్రివిధ దలాధిపతి బిపిన్ రావత్, మధులిక దంపతులతో పాటు 11 మంది ఆర్మీ భద్రతాబలగాలు కూడా మరణించిన విషయం విధితమే. రావత్ మరణంపై దేశ ప్రజలందరూ చింతిస్తుండగా.. కొందరూ మతోన్మాదులు మాత్రం అభ్యంతకరంగా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిపై ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కన్నెర్రజేసింది.
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17V5 హెలికాప్టర్ ప్రమాదంపై సోషల్ మీడియాలో వివాదస్పదంగా పోస్టులు చేసినందుకు జమ్మూకాశ్మీర్ పోలీసులు రాజౌరి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దుకాణ దారుడిని అరెస్ట్ చేసారు. అతని పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కానీ ఆ దుకానదారునిపై రాజౌరి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. నిందితులపై విచారణ చేపట్టనున్నారని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అంతకు ముందు రావత్ మరణాన్ని సెలెబ్రెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టోంక్‌కు చెందిన 21 ఏండ్ల జవాద్ ఖాన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసారు.