మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. . స్థిరంగానే బంగారం, వెండి ధ‌ర‌లు

N ANJANEYULU

మ‌హిళ‌ల‌కు ఒక శుభ‌వార్త అనే చెప్పలి.  ఇవాళ బంగారం, వెండి ధ‌ర‌లు కాస్త స్థిరంగానే కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోలు భావించే వారికి ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్‌. ప‌సిడి ధ‌ర   గత రెండు రోజులుగా నిలకడగా కొనసాగుతున్న‌ది. బంగారం ధర ఈ రోజు కూడా స్థిరంగానే ఉన్న‌ది. బంగారం ధరలో ఎలాంటి మార్పు  క‌నిపించ‌క‌పోవ‌డంతో..  వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830 వద్ద కొనసాగుతున్న‌ది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 వద్ద కొనసాగుతుంది.
బంగారం ధర నిలకడగా కొనసాగితే.. కానీ వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధ‌ర‌ ఇవాళ‌ రూ.600 పడిపోయిన‌ది. దీంతో కేజీ వెండి ధర రూ.65,000కు చేరుకుంది. బంగారం ధర స్థిరంగా కొనసాగడం.. వెండి ధరలు తగ్గడంతో ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాల‌నుకునే వారికి మాత్రం ఇది శుభ‌వార్త అనే చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: