లింకు రోడ్డు ద్వారా తిరుమ‌ల‌కు వాహ‌నాల అనుమ‌తి

N ANJANEYULU
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు తిరుప‌తి ఘాట్‌ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం  అంద‌రికీ తెలిసిన‌దే. ఈ త‌రుణంలో అలిపిరి, రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలను ఢిల్లీ ఐఐటీ నిపుణులు కేఎస్‌ రావు, చెన్నై ఐఐటీ నిపుణులు శ్రీ ప్రసాద్, టీటీడీ పూర్వపు చీఫ్‌ ఇంజనీర్, సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి బృందం నిన్న ప‌రిశీలించిన విష‌యం విధిత‌మే.
అయితే తాజాగా  కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డ ప్రాంతాల‌ను ఇవాళ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి ప‌రిశీలించారు. లింకు రోడ్డు ద్వారా తిరుమ‌ల‌కు వాహ‌నాల‌ను అనుమ‌తిచ్చారు. 25 రోజుల్లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా న‌వంబ‌ర్ 18 నుంచి డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తుల‌కు రీ షెడ్యూల్‌ స‌దుపాయం క‌ల్పించారు. అదేవిధంగా ఘాట్‌రోడ్డు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసేందుకు ఒక నెల స‌మ‌యం ప‌డుతుంఆని నిపుణులు సూచించిన‌ట్టు వెల్ల‌డించారు. ఎంతో నైపుణ్యం గ‌ల అఫ్కాన్ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని, భార వ‌ర్షాల కార‌ణంగా ఈ తేదీల‌లో భ‌క్తులు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయిన భ‌క్తుల‌కు 6 నెల‌ల‌లోపు ద‌ర్శ‌న స్లాట్ల‌ను రీ షెడ్యూల్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్టు వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: