నేటి నుంచి రెండో ‘టెస్ట్’ గెలిచిన జట్టుకే సిరీస్

N ANJANEYULU
ముంబై వేదిక‌గా నేటి నుంచి భార‌త్‌- న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ జ‌రుగ‌నున్న‌ది. ఇవాళ‌ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న‌ది. తొలి టెస్ట్‌లో విజ‌యం వ‌ర‌కు వ‌చ్చి చివ‌రి వికెట్ తీయ‌క‌పోవ‌డంతో భార‌త్ డ్రాతో సరిపెట్టుకున్న‌ది. ఎలాగైన భార‌త్ ఈ టెస్ట్‌లో సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేసుకొన్న న్యూజిలాండ్ విజ‌యం సాధించాల‌నే ఆత్మ‌విశ్వాసంతో ఉన్న‌ది. ఇక టీమ్ ఇండియా రెగ్యుల‌ర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాల్టి మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు. కొన్ని వ్య‌క్తిగత కార‌ణాల కార‌ణంగా తొలి టెస్ట్ ఆడ‌లేదు కోహ్లి.
భార‌త్ తుదిజ‌ట్టు ఎలా ఉండ‌నున్న‌దని ఆస‌క్తిక‌రంగా నెల‌కొన్న‌ది. విరాట్ కోహ్లీ ఎవ‌రి స్థానంలో జ‌ట్టులోకి వ‌స్తాడని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పుజారా  లేదా ర‌హానేల‌లో ఎవ‌రో ఒక‌రూ దూర‌మ‌య్యే అవకాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండో టెస్ట్‌కు స్పిన్ పిచ్‌ను త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. నిర్ణ‌యాత్మ‌క రెండ‌వ టెస్ట్‌లో ఫ‌లితం రావాల‌నే ఉద్దేశంతో స్పిన్ పిచ్ రూపొందించిన‌ట్టు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. భార‌త గ‌డ్డ‌పై స్పిన్‌ను  ప్ర‌ధాన అస్త్రంగా టీమిండియా భావిస్తున్న త‌రుణంలో వాంఖ‌డే పిచ్ ను దీనికి అనుగుణంగానే త‌యారు చేసాం అని ముంబై క్రికెట్ సంఘం వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: