వెల "సిరి" : సిరివెన్నెలకు ప్రముఖులు నివాళులు
మధ్యాహ్నం 1 గంటల సమయంలో జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి మహాప్రస్థానం వద్ద సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి సినీ ప్రముఖులు ఎస్.ఎస్.రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి, సినీ నటులు బాలకృష్ణ, వెంకటేష్, తనికెళ్ల భరణి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత అల్లుఅరవింద్, హీరో రానా, రావు రమేష్ పదాల సేకరణలో అలుపెరుగని బాటసారి అయిన దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పలువురు సినీ ప్రముఖులు ఉదయం నుంచి ఒక్కొక్కరుగా చేరుకొని ఫిల్మ్‌చాంబర్ వద్ద నివాళులర్పిస్తున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు.