వెల 'సిరి' : జూనియ‌ర్ ఎన్టీఆర్‌ సంతాపం

N ANJANEYULU

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  సిరివెన్నెల మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని వెల్ల‌డించారు.  తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని.. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ  నిలిచి ఉంటాయని కొనియాడారు  ఎన్టీఆర్‌.
త‌న‌కు ఎన్నో హిట్ పాట‌ల‌ను అందించార‌ని గుర్తు చేసారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు లేర‌నే వార్త‌ను త‌న‌ను ఎంత‌గానో కల‌చి వేసింద‌ని ట్వీట్ చేసారు. తాజాగా సిరివెన్నెల‌తో ఉన్న ఓ ఫోటోను జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ చేసారు. తెలుగు వారికి తీర‌ని లోటు అని, ఎన్నో సినిమాల‌కు పాట‌ల‌ను అందించిన అద్భుత సాహిత్య వేత్త అని కొనియాడారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్ర‌క‌టించారు ఎన్టీఆర్‌. సిరివెన్నెల లాంటి గొప్ప పాట‌ల ర‌చ‌యిత లేక‌పోవ‌డం తెలుగు ఇండ‌స్ట్రీకి ఒక వెలితి లాంటిద‌ని వివ‌రించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: