లంగా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం తెర : కేసీఆర్
కేంద్రమే మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకుంటున్నది. మొన్నటి సమావేశంలో బాయిల్డ్ రైస్ కోనబోమని చెప్పిన కేంద్ర మంత్రిని రా రైస్ విషయం స్పష్టత ఇవ్వాలని చెప్పినం అని గుర్తు చేసారు. మొన్న మా మంత్రులు ఢిల్లీకి వెళ్లితే మొహం లేక మాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు. ఇంతటి లంగా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందని కేసీఆర్ పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం మాకు సహకారమే అందించడం లేదన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు.