ఒకే పాఠ‌శాల‌లో 26 మంది విద్యార్థుల‌కు క‌రోనా..!

N ANJANEYULU
క‌రోనా కాస్త తగ్గుముఖం ప‌డింద‌న్నే నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌ళ్లీ పంజా విసురుతూ ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల‌పై విరుచుకుప‌డుతున్న‌ది ఈ మ‌హ‌మ్మారి. ఒడిషాలోని మ‌యూర్‌భంజ్ జిల్లాలో  ఒకే పాఠ‌శాల‌లో 26 మంది విద్యార్థినులకు కోవిడ్ సోకింది.  థాకూర్ ముండాలోని చ‌మ‌క్‌పూర్ గిరిజ‌న రెసిడెన్షియ‌ల్ బాలిక‌ల పాఠ‌శాల‌లో కోవిడ్‌ కేసులు న‌మోదైన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. మొత్తం 259 మంది విద్యార్థినులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠ‌శాల‌లో 26 కోవిడ్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో అధికారులు ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం అయ్యారు.
 ఇప్ప‌టికే కోవిడ్ సోకిన విద్యార్థులంద‌రినీ ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్రాంగ‌ణంలోని ఐసోలేష‌న్‌లో ఉంచి వైద్య సేవ‌లందిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తితే వెంట‌నే బాధితుల‌ను త‌ర‌లించేందుకు వీలుగా పాఠ‌శాల వ‌ద్దనే ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. పాఠ‌శాల‌కు వ‌స్తున్న కొంద‌రూ బాలిక‌లు స్వ‌ల్ప కోవిడ్‌ ల‌క్ష‌ణాల‌తో బాధప‌డుతున్న‌ట్టు టీచ‌ర్లు గ‌మనించి బాధిత విద్యార్థినుల‌కు వైద్య పరీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో అందులో 26 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు నిర్థార‌ణ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: