విద్యార్థులను విద్యను ఇష్టపూర్వకంగా నేర్పించాలని.. వారిని ఇబ్బందులకు గురి చేయకుండా వారిపట్ల ప్రేమతో మెలిగి విద్యపై విద్యార్థులకు ఆసక్తి కలిగించాలని ఉన్నతాధికారులు చెబుతుంటారు. అవేమి లెక్క చేయకుండా ఉపాధ్యాయులు విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదుతూ.. బెదిరింపులకు పాల్పడుతూ ఇలా చాలా ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పొందూరు మండలం వావిలిపల్లిపేట గ్రామంలని ఏపీ మోడల్ స్కూల్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నవై.స్రవంతి అనే విద్యార్థినినీ ప్రిన్సిపాల్ మార్తా తిలకం చితక బాధడంతో పాటు దాదాపు రెండు గంటల సేపు విద్యార్థినిని రూమ్‌లో బంధించాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం చేరవేసారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పొందూరు పోలీస్ స్టేషన్‌లో స్రవంతి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేసారు. అదేవిధంగా తమ కూతురు స్రవంతిని చితకబాదిన ప్రిన్సిపాల్ మార్తా తిలకం ను సస్పెండ్ చేయాలని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.