ఘ‌నంగా న‌టుడు కార్తికేయ వివాహం

N ANJANEYULU
టాలీవుడ్ న‌టుడు, ఆర్ఎక్స్-100 ఫేమ్ హీరో  కార్తికేయ ఒక ఇంటి వాడు అయ్యాడు. త‌న ప్రేమికురాలు లోహిత మెడ‌లో మూడు ముళ్లు వేసారు. హైద‌రాబాద్ లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఆదివారం కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి వేడుక‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్‌భూప‌తి, పాయ‌ల్ రాజ్‌పుత్ తో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రులైన కార్తికేయ‌, లోహిత‌ల‌ను ఆశీర్వ‌దించి అభినంద‌న‌లు తెలిపారు.

ఈ వివాహ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల‌వుతున్నాయి. కార్తికేయ బీటెక్ చ‌దువుతున్న రోజుల్లో లోహితతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌రువాత వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రూ మ‌నుసులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ త‌రుణంలోనే హీరోగా రాణించాల‌నే ఉద్దేశంతో కార్తికేయ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆర్‌.ఎక్స్‌.-100తో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మంచి మార్కులు కొట్టారు. ఈ మ‌ధ్య‌కాలంలోనే కార్తికేయ న‌టించిన 'రాజా విక్ర‌మార్క' చిత్రం విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకున్న‌ది. అజిత్ హోరోగా న‌టించిన‌ 'వ‌లిమై' సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు కార్తికేయ‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: