కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య
అప్పటికే తలపై కాల్చుకోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విభోర్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆసుపత్రి చుట్టు భారీ భద్రతను ఏర్పాటు చేసారు పోలీసులు. విభోర్ యాదవ్ ఎందుకు కాల్చుకున్నాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు అతను రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు చాలా మంచివారు అని రాసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు గోరఖ్‌పూర్ పోలీసులు.