ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కు పుల్ మీల్స్..
“నాటు నాటు” అంటూ సాగిన చంద్రబోస్ రాసిన ఈపాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు పాడారు. ఈపాట మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. సాంగ్ ఊర నాటు అనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ మాములుగా లేదు. ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ ఫుల్ మీల్స్‌గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజమౌళి ఏ సినిమా తీసినా అభిమానులను ఆకర్షించడం, ఆకట్టుకోవడంలో దిట్ట అనే చెప్పవచ్చు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన పీవీఆర్ తో చేతులు కలిపారు. ఇక నుంచి ఈ సినిమా విడుదలయ్యేంత వరకు పీవీఆర్ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్లు జరుగుతుంటాయి