భ‌ద్ర‌త బ‌ల‌గాలే నా కుటుంబం : ప్ర‌ధాని మోడీ

N ANJANEYULU
దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌వాన్ల‌తో  వేడుక‌లు జ‌రుపుకున్నారు.  జ‌మ్మూకాశ్మీర్ లోని నౌషీరా సెక్టార్‌లో మోడి ప‌ర్య‌టించారు. అనంత‌రం మోడీ మీడియాతో మాట్లాడారు. నేను ఒక్క‌డినే రాలేదు. 130 కోట్ల ప్ర‌తినిధుల‌తో వ‌చ్చాను. మ‌న జ‌వాన్లు శ‌త్రువుల‌కు ధీటైన జ‌వాబు ఇస్తున్నారు. భ‌ద్ర‌త బ‌ల‌గాలే నా కుటుంబం అని పేర్కొన్నారు. భార‌త సైనికుల‌తో దీపావ‌ళి పండుగ జ‌రుపుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు మోడీ.

2014 నుంచి ప్ర‌తి ఏడాది సైనికుల‌తో దీపావ‌ళి జ‌రుపుకుంటున్న‌ట్టు తెలిపారు. సైనికుల వ‌ల్ల‌నే భార‌త‌దేశం ప్ర‌శాంతంగా ఉంది. నౌషీరా క‌బ్జాకు గ‌తంలో శ‌త్రువు ప్ర‌య‌త్నించాడు. ఆ శ‌త్రువుకు మ‌న బ‌ల‌గాలు గ‌ట్టి స‌మాధానం చెప్పాయి. నౌషీరా ప‌విత్ర భూమి అని ప్ర‌ధాని వెల్ల‌డించారు. శ‌త్రువుల వేట‌లో అశువులు బాసిన సైనికుల‌కు నా సెల్యూట్ అని ప్ర‌క‌టించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ దేశ ర‌క్ష‌ణ‌లో ముందున్నారు. యావ‌త్ దేశం మీ సేవ‌ల‌ను చూసి గ‌ర్విస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: