కేసీఆర్ Vs ఈటెల : గులాబీ దండులో ముసలం స్టార్ట్స్ తగ్గేదేలే!
గులాబీ దండులో ముసలం మొదలు కానుంది. ఎందుకంటే హుజురాబాద్ ఫలితం కేసీఆర్ కు ఏవిధంగానూ అనుకూలంగా లేదని నిర్థారణ ఒకటి అందుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు ఇంకా ఇంకొందరికి పార్టీలో ఇకపై అంత ప్రాధాన్యం దక్కే అవకాశమే లేదు. కొడుకు కేటీఆర్ ను యువ రాజును చేసే క్రమంలో ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న కేసీఆర్ వచ్చే ప్లీనరీకి అందుకు తగ్గ లైన్ ను క్లియర్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ అల్లుడు రఘు నందన్ ను దూరం చేసుకున్న కేసీఆర్, ఇప్పుడు మరో అల్లుడు హరీశ్ రావు ను తప్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ లాంటి టఫ్ ఫైట్ ను ఆయన ఎంచుకుని ముందుకు పోవాలని భావించారు. అందుకు పావుగా హరీశ్ రావును ఈ రాజకీయ చదరంగంలో వాడుకున్నారు. దీంతో కేసీఆర్ అనుకున్నది సాధించి, పార్టీపై మరింత పట్టు పెంచుకునే క్రమంలో తన బిడ్డలను అందుకు తగ్గ ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో పెంచే క్రమంలో కేసీఆర్ ఓ విధంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇకపై ట్రబుల్ షూటర్ కు కష్టాలే అంతిమం కావొచ్చు. గులాబీ దండులో నవంబర్ నెలలో సంక్షోభం తథ్యం.