అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు : మంచు విష్ణు
కొన్ని యూట్యూబ్ చానల్స్ థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. నటీమణులు మన ఆడుపడుచులని.. వారిని గౌరవించాలని కోరారు. హీరోయిన్స్ గురించి అభ్యంతరకరమైన వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్ చానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి యూట్యూబ్ చానళ్లను నియంత్రించడం తన ఎజెండాలో ఒక అంశమని తెలిపారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని తెలిపారు. తెలుగు మీడియా తన కుటుంబానికి.. చిత్రపరిశ్రమకు సహకారం అందిస్తూనే ఉందని వెల్లడించారు.