బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్
డెల్టాను మించిన వేగంతో ఈ వేరియంట్ వ్యాపిస్తోందని ఆందోళన చెందుతుంది బ్రిటన్. డెల్టా వేరియయంట్‌తో పోల్చితే మాత్రం డెల్టాప్లస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి పెరగడానికి ప్రస్తుతం ఉన్న వాతావరణమా.? లేక వైరస్‌లో మార్పులు సంభవించడమా..? దానికి కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 6 శాతం వరకు డెల్టాప్లస్ వేరియంట్ కేసులు అని ధృవీకరించారు శాస్త్రవేత్తలు. అక్టోబర్ 20 నుంచి ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో దాదాపు 15,120 డెల్టాప్లస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.