నిర్మ‌ల్ జిల్లాలో క‌ల్తీపాలు క‌ల‌క‌లం

N ANJANEYULU
నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్‌లో క‌ల్తీపాల విక్ర‌యం క‌ల‌క‌లం రేగింది. ఒక వ్యాపార‌వేత్త ద‌గ్గ‌ర కొన్నపాల‌తో టీ చేసుకొని తాగాడు. దీంతో టీ తాగిన‌ ప‌లువురు అనారోగ్యానికి గుర‌య్యారు. టీ తాగిన కొద్ది సేప‌టికే వాంతులు, విరేచ‌నాల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు. దీంతో  బాధితుడు సుద‌ర్శ‌న్ ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.
పాలు ప‌రీక్షించ‌గా యూరియా, స‌ర్ఫ్ క‌లిపి పాల‌ను త‌యారు చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు. పోలీసులు పాల వ్యాపారిని నిల‌దీయ‌డంతో క‌ల్తీ దందా వెలుగులోకి వ‌చ్చింది. ఇలాంటి ఘ‌ట‌న మ‌రొక‌సారి జ‌రుగ‌కూడ‌ద‌నే ఉద్దేశంలో క‌ల్తీదందాపై సుద‌ర్శ‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి కల్తీ వ్యాపారం చేసి ఎంత‌మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటార‌ని స్థానికులు పాల‌వ్యాపారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే వ్యాపారిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అదేవిధంగా నిర్మ‌ల్ జిల్లా వ్యాప్తంగా సోమ‌వారం తూనిక‌ల కొల‌త‌ల శాఖ అధికారులు త‌నిఖీ చేప‌ట్టేందుకు సిద్ధం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: