బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జనాగ్రహ దీక్ష లో ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వంశీ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఆపిన ఘనత చంద్రబాబుకే దక్కిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కావాలని మోడీ తో పోటీపడి పూర్తిగా దిగజారిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు.
వయసు పెరగడంతో చంద్రబాబుకు మతి పోయిందని....మేటర్. మోటార్ లేని వ్యక్తి నారా లోకేష్ పప్పు నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు పై చెప్పులు రాళ్లు దాడి చేసి ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ వంశీ మండి పడ్డారు. ఎన్టీఆర్ శాపం తగిలి నీ కుటుంబం రాజకీయ జీవితానికి ఎందుకు పనికిరాకుండా పోయిందంటూ వంశీ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ... ఆ పార్టీ ని పట్టిపీడిస్తున్న తుప్పు నాయుడు పప్పు నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.