మనుషుల మీద కోపం తో గేదెల్ని తగలబెట్టారు...?

ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు విషయం కొన్ని కొన్ని ఘటనలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మనుషులు పై ఉన్న కోపాలను జంతువులపై చూపించడం అనేది దారుణమైన విషయం. ఈ ఘటనలో తరచుగా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. మనిషి మీద కోపంతో కుక్క పిల్లలు అదే విధంగా పెంపుడు జంతువులను చంపడం... అనేది ఈ మధ్యకాలంలో జరుగుతోంది.
తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు మండలం కొండముది గ్రామంలో మాదిగ పల్లిలో కొండముది రవికి చెందిన గోడ్ల చావిడిని అర్ధరాత్రి  తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తుల వ్యవహారం ఇది. ఈ ఘటనలో మూడు గేదెలు సజీవదహనం అయ్యాయి. గతంలోనూ ఇదే విధంగా గ్రామంలో ఇళ్లను, గోడ్ల చావిడిలను, గడ్డివాములను తగులబెట్టిన ఆగంతకులపై గ్రామస్తులు సీరియస్ గా ఉన్నారు. పోలీస్ పికెటింగ్ సహా ఏర్పాటు చేసి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: