మెగా అల్లుడు డిశ్ఛార్జ్
మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇవాళ ఆయన పూర్తిగా కోలుకుని అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయమై మెగాస్టార్ట్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందం పంచుకున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని చెబుతూ, విషెస్ చెప్పాడు చిరు. వినాయక చవితి సందర్భంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్న సాయి ధరమ్ పూర్తి స్థాయిలో రికవరీ అయి ఇంటికి చేరుకోవడంతో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి దయతో త్వరలోనే మంచి సినిమాలు చేసి మామ చిరంజీవికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయం తీసుకువచ్చిన ఆనందం కూడా సాయి ధరమ్ తేజ్ కు ఎంతో మనో బలాన్ని ఇచ్చింది.