మా ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎటువంటి తగాదాలు తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకే సంబంధిత ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది. హీరో శ్రీకాంత్, మోహన్ బాబు తో పాటు చిరు, పవన్ ఇలా అంతా అక్కడికి చేరుకుని సందడి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొదట్నుంచి తారక్ వస్తారా రారా? అన్న ఉత్కంఠత నెలకొని ఉంది. దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు తాను ఇష్టంగా లేనని, ఈ విషయం ఇదివరకే ఆయన జీవితతో చెప్పారని కొందరు తారక్ సన్నిహితులు అంటున్నారు. మరోవైపు బాబాయ్ బాలయ్య వచ్చి ఓటు వేసినందున తారక్ కూడా ఓటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరగనున్నందున ఏ నిమిషం అయిన పరిణామాలు మారవచ్చు. మరోవైపు తారక్ ఆత్మీయుడు, ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ స్వామి మాల ధారణలో ఉంటూనే, ఉదయం ఇంటికే వచ్చి ఓటు వేసి వెళ్లారు. అక్కడున్న వారందరినీ పేరు పేరునా పలకరించారు.