వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లు అక్టోబర్ 4 సోమవారం రాత్రి పని చేయలేని సంగతి తెలిసిందే. రాత్రి తొమ్మిది గంటలకు అంతరాయం తలెత్తగా మళ్లీ ఉదయం నాలుగు గంటల వరకూ అదే పరిస్థితి కనిపించింది. ఇక గతంలో కూడా ఇలా వాట్సాప్ చాలాసార్లు ఒక్కసారిగా నిలిచిపోయింది. అయితే ఒక యాప్ పనితీరు సరిగ్గా లేకపోతే మరో యాప్ కు యూజర్లు షిఫ్ట్ అవుతారని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాట్సాప్ ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ యూజర్లు ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ కు జై కొడుతున్నారు.
అంతేకాకుండా టెలిగ్రామ్ తో పాటు సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్ ను కూడా కోట్లమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల వాట్సాప్ కు అతంరాయం నెలకొన్న నేపథ్యంలో టెలిగ్రామ్ ఎంతో లాభపడింది. కొత్తగా కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయినట్టు తెలుస్తోంది. దాంతో టెలిగ్రామ్ సర్వీసులు నెమ్మది కాగా ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయట.