జిల్లా కేంద్రంలోని డిపిఓ కార్యలయం లో నిజామాబాద్ సిపి కార్తీకేయ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ...సామూహిక అత్యాచార ఘటన కేసు లో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. యువతి కి తెలిసిన వారు.. రోజంతా ఆమెతో కలిసి తిరిగిన వారే ఈ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పారు. యువతి మరియు నిందితులు కలసి ఆర్మూరు ప్రాంతంలో తిరిగి అందరూ కలిసి మద్యం సేవించారని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి అందరూ కలసి వెళుతుండగా అనుమానం వచ్చిన వ్యక్తి ఒకరు డయల్ 100 కాల్ చేశారని సీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ టౌన్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్న రాత్రి పోలీసులు ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే నిన్న నింధితురాలు పోలీసులకు తనపై అత్యాచారం జరగలేదని చెప్పింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు..కానీ యువతి మళ్లీ తల్లిదండ్రులతో కలిసి రాత్రి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.