కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు రోజుల శిశువు అదృశ్యం కలకలం రేపుతోంది. పామర్రు మండలం పెద్దమద్దాలి గ్రామానికి సొంగా ఇందుజ అనే యువతి ఆరు రోజుల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా నిన్నటి రోజున గుర్తు తెలియని ఓ మహిళ నేను నీ భర్తకు దగ్గర చుట్టమని, నేను ఏడు నెలల గర్భిణీ అని స్కానింగ్ కోసం వచ్చినట్టు చెప్పి నమ్మించింది. ఆ మాట ఈ మాట చెప్పి రాత్రి ఇందుజ వద్దే పడుకుంది.
ఇక ఈ రోజు ఉదయం ఇందుజ డిశ్చార్జ్ కొరకు ఫారం ఫిల్ చేసేందుకు వెళ్లగా బంధువైనటువంటి ఆ మహిళ శిశువును ఎత్తుకుని పరారవ్వడంతో ఇందుజ షాక్ అయ్యింది. దాంతో ఇందూజ తన బిడ్డ కోసం కన్నీరుమున్నీరయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువును అపహరించిన మహిళ కోసం గాలింపు చర్యలు ఇప్పటికే ప్రారంభించారు.