రాజ్ కుంద్రా కేసులో షాక్.. వాళ్ళందరి మీద లుకౌట్ నోటీసులు!

Chaganti
అశ్లీల వీడియోలు చేసిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సహచరుడు ప్రదీప్ బక్షిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు రాజ్ కుంద్రా సహా నలుగురిపై 1500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పే, యశ్ ఠాకూర్ లేదా అరవింద్ శ్రీవాస్తవ మరియు ప్రదీప్ బక్షి ఉన్నారు. రాజ్ కుంద్రాకు నిన్ననే బెయిల్ వచ్చింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీసి కొన్ని యాప్‌ల ద్వారా వాటిని ప్రచురించడంలో పాలుపంచుకున్నట్లు చెబుతోంది. ఈ పని చేసి వారు  కోట్లు సంపాదించారని అంటున్నారు. ఈ యాప్ పేరు హాట్‌షాట్స్ యాప్ కాగా ఇది అశ్లీల అంశాలను పోస్ట్ చేయడం కోసమే సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: