బిగ్‌బాస్ రేటింగ్ త‌గ్గిందా? పెరిగిందా?

Garikapati Rajesh

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమైంది. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ముచ్చటగా మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యతను త‌న‌పై పెట్టుకున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తానంటూ చెప్పారు. ఏమైందో ఏమో కానీ ఈసారి ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను పెద్దగా ఆదరించనట్లు క‌న‌ప‌డుతోంది. బిగ్‌బాస్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కే దారుణ‌మైన రేటింగ్ వ‌స్తే మిగ‌తా ఎపిసోడ్ల‌కు ఎలా వ‌స్తుందోన‌నే శంక నిర్వాహ‌కుల‌కు ప‌ట్టుకుంది. ఐదో సీజన్‌తో  గ‌త రికార్డులు తిరగరాయడం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. అనూహ్యంగా గత రెండు సీజన్ల కంటే ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌కు కేవలం 15.7 టీఆర్పీ మాత్రమే రావ‌డంతో అంద‌రూ అవాక్క‌య్యారు. ఆద‌ర‌ణ పెంచుకోవ‌డానికి ఏం చేయాలి? గ‌తంలో ఉన్న ప్ల‌స్ పాయింట్లు ఏమిటి? ఇప్పుడున్న మైన‌స్ పాయింట్లు ఏమిటి? అనే విష‌యంలో నిర్వాహ‌కులు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ప్ర‌జ‌ల‌కు బిగ్‌బాస్‌మీద ఆద‌ర‌ణ ఏమైనా త‌గ్గుతోందా?  లేదంటే ఈసారి అంద‌రూ కొత్త ముఖాలే కావ‌డంతో ప్ర‌జలు చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌టంలేదా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ లాంచింగ్ ఎపిసోడ్‌కు దారుణ‌మైన రేటింగ్ రావ‌డం బిగ్‌బాస్‌కు కూడా న‌చ్చ‌లేదు సుమా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: