సోనూ ఇల్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు..!

నటుడు, తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ఇల్లు మరియు ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు చేశారు. సోనూ సూద్ కు చెందిన మొత్తం ఆరు స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. సోనూ సూద్ ను ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం మెంటార్ షిప్ ప్రోగ్రాం కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లో బుధవారం సోనూ సూద్ కు సంబందించిన ఇల్లు మరియు ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం సోను సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన తరవాత సోనూ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను సోనూ ఖండించారు.. అంతే కాకుండా తాను సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చేది లేదని అనేక సార్లు సోనూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సోనూ సూద్ ఆయన సేవా కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా కొనసాగిస్తూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: