కూపీ లాగుతున్న పోలీసులు..మరో యువకుడితో తేజ్ పోటీ..?

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కేసులో పోలీసులు కూపీలాగుతున్నారు. మరో యువకుడితో కలిసి సాయి ధరమ్ తేజ్ పోటీ పెట్టుకోవడం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నిర్ణయించుకున్న డెస్టినేషన్ కు ఎవరు ముందు చేరుతారో అని తేజ్, యువకుడు పోటీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పోటీలో ఓ సినీ నటుడు కుమారుడు ఉన్నట్టు తెలుస్తోంది. పోటీలో అతివేగంగా దూసుకువెళుతూ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.


అయితే దీని పై పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం తేజ్ బైక్ రైడింగ్ పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే తేజ్ పై 336 ఐపీసీ , 184 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు నరేష్ తన కుమారుడు మరియు తేజ్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో  టాపిక్ గా మారాయి. పలువురు బైక్ రైడింగ్ లకు వెళుతున్నారని...వాళ్లకు బైక్ క్లబ్ కూడా ఉందని నరేష్ మీడియా తో వెల్లడించారు. అంతే కాకుండా వాళ్ళ వద్ద 1000సిసి బైకులు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: