పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి రాబిస్ వ్యాధి సోకినట్లు వ్యవహరిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లిల్లిపుట్ అంటూ జీవన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడం రాజ్యాంగ హక్కు అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలకు అజ్ఞానం ఎక్కువైందని... మన్మోహన్ సింగ్ పీఎం గా ఉన్నప్పుడు అప్పడు గుజరాత్ సీఎంగా మోడీ కూడా అనేక సార్లు కలిశారని గుర్తు చేశారు.
పార్లమెంట్ సాక్షిగా మోడీని రాహుల్ గాంధీ కిస్ ఇచ్చారు- మరి అదేం బంధం? అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చైనా రాయబారిని ఎందుకు కలిశారు? చైనాతో రాహుల్ కుమ్మక్కు అయ్యారా? అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ గ్లోబెల్స్ ప్రచారం- గాసిప్స్ అడ్డాగా మారిందంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో వారం రోజులు ఉంటే ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.