కాళ్ళ పారాణి అరక ముందే పెంక్షన్ పంపిణీ లో వాలంటేర్ ..!

కాళ్ళ పారాణి ఆరక ముందే ఓ వాలంటీర్ డ్యూటీ లోకి దిగారు. పెళ్లయ్యాక ఎవరైనా కనీసం వారం రోజులు అయినా తమ ఉద్యోగానికి దూరంగా ఉంటారు. వీలైతే నెల రోజులు కూడా సెలవులు పెట్టేస్తారు. కానీ ఏపిలో మాత్రం ఓ వాలంటీర్ పెళ్ళైన సాయంత్రానికే డ్యూటీ లోకి దిగాడు. గంపల గూడెం మండలం గంపల గూడెం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ కోట శివ సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న ఫించన్ కానుకను ఉదయం తెల్లవారుజాము నుండి పంపిణీ చేస్తూనే ఉన్నారు.


ఇక పెళ్ళైన రోజున కూడా సాయంత్రం వాలంటీర్ శివ పించన్ పంపిణీ చేయడం విశేషం. ప్రస్తుతం వాలంటీర్ ఫించను పంపిణీ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాలో  జగన్న వాలంటీర్ లు అంటే ఇలా ఉండాలి అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు ఇంత అతి చేయడం అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక పెళ్లి కొడుకు మంచి చేద్దామని ఫించన్ పంపిణీ చేశాడా...లేదంటే పబ్లిసిటీ కోసమే చేశాడా అన్నది అతడికే తెలియాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: