టీటీడీ బోర్ట్ ఆర్గానిక్ భోజనం పేరుతో విమర్షలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్గానిక్ భోజనం పేరుతో భక్తుల నుండి డబ్బులు దొబ్బే ప్రయత్నం చేస్తుందని తీవ్రవిమర్శలు వచ్చాయి. అయితే తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆద్వర్యంలోని 117 కల్యాణ మండపాల నిర్వహణను ఆలయాలకు, హిందూ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆలయాలు, ట్రస్టులు, మఠాలు, వ్యక్తులు తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది.
కల్యాణ మండపాలను లీజుకు తీసుకోవాలనుకునేవారు అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపాలని పేర్కొంది. లేదా 0877 2264174 అనే నంబర్ కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దాంతో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. టీటీడీ ఖజానాను నింపుకోవడం కోసమే కళ్యాణ మండపాల లీజు నిర్ణయం తీసుకుందని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది.