నల్గొండ : పూడ్చి పెట్టిన శవం రోడ్డుపైకి.. !

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొండ కింది గూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బుచ్చమ్మ అనే వృద్ధురాలు నిన్న రాత్రి మృతిచెందగా ఆమెను కుటుంబ సభ్యులు గ్రామంలో సమాధి చేశారు. అయితే ఆ సమాధి చేసిన అనంతరం దుండ‌గులు రాత్రి తవ్వితీసి మృతదేహాన్ని ఆర్ అండ్ బీ రహదారిపై రోడ్డుకు అడ్డంగా పెట్టారు. అయితే ఉదయాన్నే స్థానికులు గ్రామస్తులు రోడ్డుపై దేహాన్ని చూసి షాక్ కు గురయ్యారు. గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబంతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. లేదంటే ఎవరైనా ఆక‌తాయిలు ఇలా చేసి ఉంటారా.. అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: