టు బి ఫ్రాంక్ : యూ ట్యూబర్లూ జర జాగ్రత్త
టెక్నాలజీ పెరిగాక మనుషుల్లో ప్రవర్తన దారి తప్పింది..ఛానెళ్లు పెరిగాక మనుషుల్లో పేరు తెచ్చుకోవాలన్న క్రేజ్ పెరిగింది..ఈ తం టాలన్నీ ఎందుకు అని ఎవ్వరయినా అనుకుంటున్నారా.? లేదు కదా! కేవలం వ్యూయర్ షిప్ కోసం పడిన పాట్లు కొట్టుకునే దాకా వెళ్లింది. ఆ ఫ్రాంక్ కథ టు బి ఫ్రాంక్ గానే తెల్సుకోండి ఇక..
అతి చేస్తే గతి చెడుతుందని అంటారు..అలా ఓ యూ ట్యూబర్ చేసిన అతి కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది.. గొడవ కాస్త భౌ తిక దాడుల వరకూ వెళ్లింది..ఇది ఫ్రాంక్ వీడియో ని చెప్పినా సరే ! దేహశుద్ధి చేసి మరి! పంపారా యజమాని. వివరాలిలా ఉన్నా యి..మాధ్యమాల విస్తృతి పెరిగాక, అదే పనిగా కొందరు వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అసలు అవసరం ఉన్నా,లేకు న్నా తాము హైలెట్ అవ్వాలన్న వంకతో ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు ఫ్రాంక్ కాల్ ఫ్రాంక్ వీడియో అంటూ తెగ గోల చేస్తున్నా రు. హైద్రాబాదీ ఫ్రాంక్స్ పేరుతో నెట్టింట్లో హల్ చల్ చేసే ఓ యూ ట్యూబర్ ఆబిడ్స్ లో అడుగు పెట్టాడు.. జగదీశ్ మార్కెట్ లో ఉ న్న ఓ మొబైల్ షాపునకు పోయి ఫ్రాంక్ వీడియో పేరిట యజమానికి కోపం తెప్పించి, తగువు దిగాడు. ఆఖరికి అది తీవ్ర స్థాయికి చేరుకుని ఆ యూ ట్యూబర్ ను ఆ మొబైల్ షాపు ఓనర్ చితకబాది ఇంటికి పంపాడు. కనుక యూ ట్యూబర్లూ ఒళ్లు జాగ్రత్త.. కేవ లం రేటింగ్స్ కోసం ఇలాంటి తాపత్రయాలు గతంలో కొన్ని ఛానెళ్లు కూడా పడి పడి జనం దగ్గర తిట్లు తిన్నాయి.. కాకపోతే అప్పుడు తిట్లు ఇప్పుడు తన్నులు.. ఎంతయినా జనం అప్ డేట్ అయ్యారయ్యా..మీరూ!మారండి.