దేశంలో మళ్లీ డ్రగ్స్ కలకలం
చాలా కాలం తరువాత దేశంలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. ఇంతకాలం ఈ తరహా సంఘటనలేవీ లేవనకుంటున్న తరుణాన మాదక ద్రవ్యాలకు సంబంధించి రవాణా, అదేవిధంగా విక్రయం అన్నవి ఇప్పుడు వెలుగు చూడడం పోలీసులను విస్మయ పరుస్తోంది. ముఖ్యంగా ముంబై చెన్నయ్ హైద్రాబాద్ వంటి మహానగరాలే లక్ష్యంగా సాగే ఈ మాఫియా కొంత కాలంగా స్తబ్దుగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ఘటనకు కారకులెవ్వరు? వారికి సంబంధించిన వారెవ్వరు అన్నది దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
ఇంకా చెప్పాలంటే...
కొన్నాళ్లుగా ఓ విధంగా కరోనా కారణంగా ఇలాంటి వార్తలే లేవు.. వివిధ దేశాల నుంచి ఇక్కడికి చేరుకునే మాదక ద్రవ్యాల జాడే లేదు.. అని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఓ ఉలిక్కి పాటు.. చెన్నయ్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకోవడంతో కొత్త కలకలం రేగింది. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయి... సంబంధిత బృందాలను రంగంలోకి దించాయి. జర్మనీ నుంచి వంద టాబ్లెట్స్ ను నిఘా వర్గాలు పట్టుకున్నాయి.. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియ రావాల్సి ఉంది.