యాక్షన్ హీరో అర్జున్ చెన్నైలో తన సొంత డబ్బుతో హనుమాన్ గుడిని నిర్మించారు. అంతే కాకుండా ఈ గుడిని జులై 1న మహా అభిషేకంతో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా అర్జున్ కు హనుమాన్ అంటే భక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో హీరోగా నటించిన అర్జున్ ఆ సినిమాలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు. అంతే కాకుండా నితిన్ హీరోగా నటించిన ఓ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించి మెప్పించారు.
ఇక వేరే సినిమాల విషయానికి వస్తే అర్జున్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. విలన్ గా మరియు ఇతర పాత్రల్లో నటిస్తూ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం అర్జున్ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో రేంజ్ కు అర్జున్ ఎదిగారు కూడా కానీ ఆ తరవాత వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయారు.