అలా చేస్తే హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు : కేటీఆర్

frame అలా చేస్తే హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు : కేటీఆర్

హైదరాబాద్ నగరంలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.  ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన హైదరాబాద్ లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరం అని పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో కసౌళి లో ఉన్న జాతీయ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కు ఇక్కడి సంస్థలు టెస్టింగ్ కి పంపడం ద్వారా 45 రోజుల సమయం వృధా అవుతుందని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక్కడే టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఈ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ఉపయోగపడుతుందని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి బ్యాచ్ ని కసౌలి కి పంపడం ద్వారా అనేక సమస్యలు, ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంద‌ని అన్నారు. వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని జీనోమ్ వ్యాలీలో అందిస్తాం అందిస్తామ‌ని తెలిపారు. అంతే కాకుండా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: