మహేష్ కు హీరోయిన్ దొరికేసిందిగా .. అప్పుడే షూటింగ్ స్టార్ట్ ..?

Amruth kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌కత్వంలో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతో స్పీడ్ గా జరుగుతుంది .. అలాగే ఇప్పటికే సైలెంట్ గా ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి .. ఇక దీంతో అందరూ సంతోషించిన ఇతర కాస్ట్ విషయాలు ఇంకా బయటికి రావటం లేదు .. ఈ క్రమంలోనే మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో కనిపించాడు ఆయనతో పాటు ఓ హీరోయిన్ కూడా అక్కడ కనిపించింది.

మహేష్ రాజమౌళి సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ క్రమంలోనే ఈ సినిమా క్యాస్టింగ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది .. ఇక రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ స్టాండ్స్ కి తగ్గట్టుగానే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు .. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ షూటింగ్లో కనిపించాడు. ఇక ఆ షూటింగ్స్ స్పాట్లో మిల్కీ బ్యూటీ తమన్న కూడా కనిపించింది .. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. ఇక దీంతో అభిమానులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు ..  మహేష్ తో షూట్ లో తమన్నా పాల్గొన్న వెంటనే అందరూ ఆశ్చర్య పడుతున్నారు .. అయితే ఈ షూట్ రాజమౌళి సినిమా కాదని .. ఇటీవలే మహేష్ బ్రాండ్ అంబాసిడర్ కమ్ పార్ట్నర్‌గా స్టార్ట్ చేసిన సోలార్ కంపెనీ 'ట్రూ జోన్ సోలార్'కు సంబంధించిన యాడ్ షూట్ గా తెలిసింది.

ఇక SSMB29  విషయానికొస్తే ఈసారి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌కి  చాలా సమయం తీసుకున్నాడు .అలాగే ఈ సినిమా షూటింగ్ త్వరగా  పూర్తి చేసి 2026 చివరిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ .. అయితే ఈ విషయాన్ని ఆయన బయటకు మాత్రం చెప్పటం లేదు .. ఎందుకంటే ఓ రిలీజ్ డేట్ చెప్పడం అది చేయి జారిపోవడం మరో రిలీజ్ డేట్ కు వెళ్లడం ఎలా కన్ఫ్యూజ్ సృష్టించడం రాజమౌళికి ఇష్టం లేదు .. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ లు చాలా మారాయి .. ఈసారి అలా కాకుండా ఆయన ఉండాలనుకుంటున్నారు. అందుకే వీలైనంతగా లో ప్రొఫైల్ గా ఉండాలని భావిస్తున్నారు .. అందుకే ఎక్కడ ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు .. అలాగే గతంలో రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టిన ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ ఏంటో చెప్పటం ఆయనకి అలవాటు .. ఈసారి అలాంటిదేమీ లేదు ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగు మొదలు పెట్టేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: