గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.. జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా రాంచరణ్ గత సినిమాల రికార్డ్స్ తిరగ రాస్తుందో లేదో చూడాలి.. రాంచరణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ వున్నాయి.. చిరుత సినిమా తో సినీ ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తన రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసారు..చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన తొలి బిగ్గెస్ట్ మూవీ ‘’మగధీర “..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందించారు.. పునర్జన్మల ఆధారంగా తెరకెక్కిన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది.. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు ప్రాఫిట్స్ దూసుకెళ్ళింది..తెలుగు చిత్ర పరిశ్రమలో 100 కోట్ల క్లబ్‌కి చేరిన తొలి చిత్రంగా మగధీర రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమా టాలీవుడ్‌కి గ్లోబల్ వైడ్ గుర్తింపును తెచ్చింది. రామ్‌చరణ్ కెరీర్‌కి కూడా మగధీర మంచి బూస్టర్‌గా నిలిచింది. ఇక రాజమౌళి కి కూడా భారీ సినిమాలు చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది. మగధీర అనంతరం టాలీవుడ్ రేంజ్ పెరిగే సినిమాలతో రాజమౌళి దూసుకెళ్లారు.. అయితే మగధీరతో రాజమౌళి చేసిన ప్రయోగం ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కుళ్ళుకునేలా చేసింది.. రాంచరణ్ మగధీర తరువాత వరుస సినిమాలు చేసి గ్లోబల్ స్థాయి పాపులరిటీ సంపాదించుకున్నారు..