రామ్ చరణ్ ఉపాసనల క్యూట్ లవ్ స్టోరీలో ఈ సీక్రెట్స్ మీకు తెలుసా.?

Pandrala Sravanthi
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీ తో ఓ సినిమా తీసేయొచ్చు..వీరిద్దరూ బడా ఫ్యామిలీకి చెందిన వాళ్లే.. అటు రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి చిరంజీవి కొడుకుగా ఫేమస్..అయితే ఉపాసన అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా పాపులర్ అయింది. అలా వీరిద్దరి స్నేహం కాలేజీ రోజుల్లోనే జరిగినట్టు తెలుస్తోంది.మరి వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటి? వీరి లవ్ స్టోరీ లో ఉన్న సీక్రెట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు మొదటిసారి కలుసుకున్నది స్పోర్ట్స్ క్లబ్లో.. వీరిద్దరూ చదువుకునే రోజుల్లో లోనే పరిచయం. అయితే వీరు ప్రేమించుకున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయట.అయితే వీరి మధ్య మొదట ప్రేమ లేదు స్నేహం మాత్రమే ఉంది. ఆరెంజ్ మూవీ తర్వాత వీరి మధ్య ప్రేమ బంధం ఏర్పడినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ ఫ్రెండ్స్ గా మొదట కలిశారు.. 

ఆ తర్వాత లవర్స్ గా మారారు. ఇక అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మొదటి సారి తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. నేను ఓ అమ్మాయిని చూశాను. చూడగానే నచ్చేసింది. నేను నా క్లోజ్ ఫ్రెండ్ నే పెళ్లాడబోతున్నాను అంటూ చెప్పాడు.కానీ ఉపాసన పేరు మాత్రం తీయలేదు. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో చాలాసార్లు గొడవలు పెట్టుకున్నారట. కానీ అవి చిన్న సిల్లీ గొడవలే. ఇక ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబ సభ్యులకు చెప్పాక ఇద్దరు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అప్పట్లో రామ్ చరణ్ ఉపాసన పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేశారు.అలాగే వీరి పెళ్లి 2012 జూన్ 14న జరిగింది.ఇక పెళ్లయిన దాదాపు పది సంవత్సరాలకు వీరికి క్లీంకార పుట్టింది. అయితే రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్న సమయంలో ఉపాసనపై ఎన్ని ట్రోల్స్ వచ్చాయో చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా రామ్ చరణ్ డబ్బు కోసమే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడని,లేకపోతే అంత పెద్ద హీరో అయిఉండి అంద విహీనంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేంటి అంటూ ఇలా ఎంతోమంది ట్రోల్ చేశారు.అయితే ఈ ట్రోల్స్ పై ఉపాసన కూడా ఆ మధ్య కాలంలో స్పందించి చాలా బాధపడ్డట్టు చెప్పింది.ఇక ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ప్రస్తుతం ఉన్న ఉపాసనని చూస్తే అందరు కుళ్ళుకోవాల్సిందే. ఒకప్పుడు ఉపాసన  ఎలా ఉండేదో అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు ఉపాసన  ఉంది.అందంలో రామ్ చరణ్ ని వెనక్కి నెట్టే విధంగా ఉపాసన ఉంది. అలా ఎవరు ఎన్ని టోల్స్ చేసినా కూడా ఇప్పటివరకు వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి వివాదాలు రాకుండా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక ఉపాసన కేవలం రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో వైస్ చైర్మన్ గా కూడా బాధ్యతలు తీసుకుంది.అలాగే అపోలో హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యం అందిస్తూ మానవతా వాదిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: