పంజాబ్ లో గ్రీన్ ఫంగ‌స్ క‌ల‌క‌లం.. !

ఇప్ప‌టికే క‌రోనా, బ్లాక్ ఫంగస్ తో ప్ర‌జ‌లు వ‌ణికిపోతుంటే ఇప్పుడు గ్రీన్ ఫంగస్ కూడా ఎంట్రీ ఇచ్చి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే దేశంలో గ్రీన్ ఫంగ‌స్ ను గుర్తించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా పంజాబ్ లో మొద‌టి గ్రీన్ ఫంగ‌స్ కేసు న‌మోదైంది. క‌రోనా నుండి కోలుకున్న త‌ర‌వాత ఓ వ్య‌క్తి గ్రీన్ ఫంగ‌స్ బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని డాక్ట‌ర్ ప‌ర‌మ్ వీర్ సింగ్ వెల్ల‌డించారు. ఇది వర‌కు ఒక గ్రీన్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాల‌తో ఓ వ్య‌క్తిని గుర్తించామ‌ని చెప్పారు. 

కానీ అతడికి గ్రీన్ ఫంగ‌స్ నిర్ధార‌ణ అవ్వ‌లేద‌ని చెప్పారు. అయితే ప్రస్తుతం మ‌రో వ్య‌క్తిలో గ్రీన్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయని....గ్రీన్ ఫంగ‌స్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయింద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వ్య‌క్తికి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొద‌టి గ్రీన్ ఫంగ‌స్ కేసు న‌మొద‌వ‌డంతో వైద్యులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా నుండి కోలుకున్న వారికే గ్రీన్ ఫంగ‌స్ సోకుంతుందా ఇత‌ర‌లకు కూడా సోకుతుందా అన్న దానిపై ప్ర‌స్తుతం ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: