ప‌డ‌వ‌లతో చైనాను ఢీకొట్ట‌నున్న భార‌త్‌?

Garikapati Rajesh

భార‌త్‌, చైనా మ‌ధ్య పాంగాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద త‌ర‌చుగా ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌ల‌గాల‌ను వేగంగా త‌ర‌లించేందుకు భార‌త్ 17 మ‌ర‌ప‌డ‌వల త‌యారీకి ఆర్డ‌రిచ్చింది. గోవాకు చెందిన ఆక్వారియుస్ షిప్‌యార్డు వీటిని త‌యారుచేస్తోంది. గంట‌కు 37 కిలోమీట‌ర్ల వేగంగా ప్ర‌యాణించే ఈ ప‌డ‌వ‌లో 22 మంది సైనికుల‌ను త‌ర‌లించ‌వ‌చ్చు. పూర్తిగా ఫైబ‌ర్ గ్లాస్‌తో త‌యార‌య్యే ఈ ప‌డ‌వలు 35 అడుగుల పొడ‌వుండ‌టంతోపాటు వీటిల్లో తేలిక‌పాటి ఆయుధాల‌ను కూడా అమ‌ర్చ‌వ‌చ్చు. పాంగాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద నుంచి బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించేలా ఈ ఏడాది మార్చిలో భార‌త్‌, చైనా మ‌ధ్య ఒప్పందం కుదిరిన సంగ‌తి తెలిసిందే. గోగ్రాపోస్ట్‌, హాట్ స్ప్రింగ్స్ వ‌ద్ద మాత్రం ఎటువంటి పురోగ‌తి ఉండ‌టంలేదు. దీంతో భార‌త్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా ప‌డ‌వ‌ల‌ను భార‌త నావికాద‌ళం కూడా ఉప‌యోగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: