ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..."శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని కెసిఆర్ ప్రతి సందర్భంలో చెప్తుంటారు. ఆ మేరకు పోలీస్ శాఖకు తగిన కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత వచ్చిన మార్పులను గమనించవచ్చు. సీఎం ఆధ్వర్యం లో పోలీస్ శాక లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నేరాలను అరికట్టడం, ప్రెండ్లీ పోలీసింగ్ లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పీఎస్ భవనాలను ఆధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నాము. పోలీసులకు, ఫిర్యాదు దారులకు సౌకర్యంగా ఉండేలా నూతన పోలీస్ స్టేషన్ల భవనాలున్నాయి. పోలీసులంటే ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచాము. సీఎం గారి విజన్ ప్రకారం, హైదరాబాద్ మహా నగరం పరిధిలో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. హైదరాబాద్ లో ఏదైనా నేరం చేస్తే దొరికి పోతమనే భయం నేరగాళ్లలో ఏర్పడింది." అంటూ మహేందర్ రెడ్డి వ్యాక్యానించారు.