కృష్ణాజిల్లా : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునః ప్రారంభమైయ్యాయి.దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకి ప్రత్యేక విమానం చేరుకుంది.ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా నేటి నుంచి మళ్లీ ఈ సర్వీసులు ప్రారంభమవ్వడంతో విదేశాల్లో ఉన్నవారు తిరిగి వస్తున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశీ సర్వీసులను ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకన్న ప్రయాణికుల భద్రతపై అధికారులు పర్యవేక్షించారు.వచ్చిన వారందరికి స్క్రీనింగ్ చేసి..కస్టమ్స్ అధికారుల తనిఖీల అనంతరం వారిని బయటి అనుమతించారు.ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.