తరుణ్ తేజ్‌పాల్ కేసులో తీర్పు వాయిదా..!!

Madhuri
లైంగిక వేధింపుల కేసులో తెహ‌ల్కా.కామ్ మాజీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ త‌రుణ్ తేజ్‌పాల్‌పై విచార‌ణ కొన‌సాగుతున్న‌ విషయం తెలిసిందే. తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరణ్ తేజ్‌పాల్‌పై ఉన్న లైంగిక దాడి కేసులో తీర్పును గోవా సెషన్స్ కోర్టు మే 19వ తేదీకి వాయిదా వేసింది. కోవిడ్ నేపథ్యంలో సిబ్బంది కొరత ఉన్నందున తీర్పులో జాప్యం తలెత్తినట్టు నార్త్ గోవాలోని మపుజ జిల్లా, సెక్షన్స్ కోర్టు బుధవారంనాడు పేర్కొంది. ఈ కేసులో ఏప్రిల్ 27న తీర్పు ప్రకటించాల్సి ఉండగా, గత విచారణ సందర్భంగా తీర్పును మే 12కు వాయిదా వేసింది. తాజాగా మరోసారి తీర్పు వాయిదా పడింది.
కాగా, థింక్ ఇన్ గోవా స‌మావేశంలో త‌రుణ్ తేజ్‌పాల్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాటంటూ తెహ‌ల్కా.కామ్‌కే చెందిన ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు 2013లో ఆయ‌న‌పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు త‌రుణ్ తేజ్‌పాల్‌పై కేసు న‌మోదు చేసిన గోవా పోలీసులు 2013 న‌వంబ‌ర్ 30 తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచార‌ణ చేప‌ట్టింది. అయితే, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేయాల‌ని తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అదేవిధంగా బెయిల్ పిటిష‌న్ కూడా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: