కరోనా మహమ్మారి మనుషుల ఆరోగ్యాలతో ఒక ఆట ఆడుకుంటుంది. దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. నాలుగువేల మంది మరణిస్తున్నారు. ఈ మహమ్మారి నిత్యం వందలాది కుటుంబాలకు శోకసంద్రంలో ముంచుతోంది. మరెన్నో కుటుంబాలకు అండలేకుండా చేస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొవిడ్ సంక్షోభం పై స్పందించారు. ట్విట్టర్ ద్వారా మహేశ్ స్పందిస్తూ.. త్వరలోనే కొవిడ్ నుండి బయటపడుతామని.. అందరూ సురక్షితంగా ఉండాల్సిందిగా మహేశ్‌బాబు సూచించారు. కొవిడ్-19 కేసులు ప్రతీరోజు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించాలన్నారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దన్నారు. ఒకవేళ కొవిడ్ పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేట్ కావాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య లక్షణాలు సరిచూసుకోవాలన్నారు.