క‌రోనా కాటుకు ప్ర‌ముఖ హీరోయిన్ సోద‌రుడు మృతి

VUYYURU SUBHASH
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. ఆసుపత్రులలో ఔసీయూ బెడ్స్ దొరకక, ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు  కోల్పోతున్న వైనం  మరింత ఆందోళన రేపుతోంది.  తాజాగా క‌రోనా కాటుకు ప్ర‌ముఖ హీరోయిన్ పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో తన సోదరిడికి కరోనా సోకి పరిస్థితి ఆందోళనకరంగాఉందని వెంటిలేటర్‌, బెడ్‌, కావాలని కోరుతో పియా ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకే అతడు మృతి చెందాడు.  వెంటిలేటర్ సపోర్ట్ లేకపోవడంతో  తన సోదరుడు కరోనాకు బలైపోయాడంటూ  ఎమోషనల్ ట్వీట్ చేశారు. త‌న క‌ళ్ల ముందే సోద‌రుడు ప్రాణాల కోసం విల‌విల్లాడుతున్నా తాను ఏం చేయ‌లేక‌పోయాన‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  


పియా 2008లో తమిళ చిత్రం పోయి సోల్లా పోరోమ్‌తో  పియా తన యాక్టింగ్‌ కరియర్‌ను ప్రారంభించారు.  ఆ తరువాత  హీరో అజిత్  ఏగన్,  జివా  కో చిత్రాలలోని పాత్రలతో గుర్తింపు  తెచ్చుకున్నారు.  ఆ తరువాత తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మూవీల్లో కూడా కనిపించారు. విజయలక్ష్మి దర్శకత్వంలో 2018 తమిళ-మలయాళ ద్విభాషా అభియుం అనువం మూవీలో ఆమె చివరిసారిగా బిగ్‌స్క్రీన్‌పై కనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: