బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

VUYYURU SUBHASH
నందిగ్రామ్‌లో ఎట్ట‌కేల‌కు 6వ రౌండ్ ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఆధిక్యంలోకి వ‌చ్చారు. తొలి రౌండ్ నుంచి ఐదు రౌండ్లు ముగిసే వ‌ర‌కు వెన‌క‌ప‌డి ఉన్న మ‌మ‌త ఆరో రౌండ్‌కు ఆధిక్యంలోకి వ‌చ్చారు. 5వ రౌండ్ వ‌ర‌కు 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న సువేందు అధికారి.. 6వ రౌండ్‌కు వ‌చ్చే స‌రికి ఏకంగా వెన‌క‌ప‌డిపోగా మ‌మ‌త 1427 ఓట్ల ఆధిక్యంలోకి వ‌చ్చాశారు. ఇక నందిగ్రామ్ విష‌యానికి వ‌స్తే ఇది రెండు బ్లాకులుగా ఉంటుంది. బ్లాక్ 1లో 45 శాతం ఓట‌ర్లు ఉంటారు. ఇక్క‌డ హిందువుల ఓట్లు ఎక్కువ‌. ఇక్క‌డ‌ సువేందు అధికారికి పాజిటివ్ ఉంటుంద‌ని ముందునుంచే అంచ‌నాలు ఉన్నాయి. ఇక బ్లాక్ 2లో 55 శాతం ఓట్లు ఉంటాయి. ఇక్క‌డ ముస్లిం పాపులేష‌న్ ఎక్కువ‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: