రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్... కళ్లు జిగేల్
తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్‌లో అనూహ్యంగా పెరిగిందంట. అగ్రశ్రేణి పంపిణీదారులు ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ఇప్పటికే నిర్మాతలను సంప్రదించారంట. భారీగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు 3.5 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల మధ్య బిజినెస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.